ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ కార్డులో మీ ఫొటో నచ్చట్లేదా? సింపుల్‌గా ఇలా మార్చుకోండి..

national |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 10:59 PM

భారత పౌరులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. కేంద్ర విశిష్ట గుర్తింపు, ప్రాధికార సంస్థ (UIDAI) దీనిని జారీ చేస్తుంటుంది. ఈ 12 అంకెల ఆధార్ నంబర్‌లోనే మన ప్రాథమిక సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది. మన పేరు, చిరునామా, పుట్టినతేదీ, లింగం, ఫొటో, ఫోన్ నంబర్ సహా బయోమెట్రిక్ వివరాలు అందులో ఉంటాయి. అయితే మన ఆధార్ కార్డులో వివరాలు సరిగ్గా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాలి. పేరు స్పెల్లింగ్ మిస్టేక్ ఉండొద్దు. చిరునామా సరైనది ఉండాలి. అయితే వీటిల్లో ఏదైనా అప్డేట్ చేసుకోవాలంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో వివరాల్ని చాలా మంది అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఆధార్ సెంటర్ల దగ్గర క్యూ కూడా మనం గమనిస్తూనే ఉంటాం. పేరు, పుట్టినతేదీ, అడ్రస్ వంటివి అయితే ఆన్‌లైన్‌లో మీరే చేసుకోవచ్చు.


>> ఆధార్ కార్డులో ఉండే ఫొటో అయితే చాలా మందికి నచ్చదు. చాలా సంవత్సరాల కిందట దిగి ఉంటారు కాబట్టి.. అది అంత బాగోకపోవచ్చు. అందుకే ఆధార్ కార్డుల్ని వారు ఇతరులకు చూపించేందుకు కూడా మొహమాటపడుతుంటారు. అందుకే ఫొటో ఆధార్ కార్డులో ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. అయితే ఫొటో, కనుపాప, వేలిముద్రలు అనేవి బయోమెట్రిక్ కిందకు వస్తాయి. వీటి కోసం కచ్చితంగా ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిందే.


ఆన్‌లైన్ నుంచి ఆఫ్‌లైన్ ద్వారా ఎలా?


తొలుత ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి https://uidai.gov.in/en/ వెళ్లాలి.


స్క్రీన్‌పై హోం పేజీ కనిపిస్తుంది.


అక్కడ మైఆధార్‌లో ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఫామ్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. దానిని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.


అడిగిన అన్ని వివరాల్ని ఫిల్ చేయాలి.


తర్వాత ఆ ఫాంతో దగ్గర్లోని ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. సంబంధిత అధికారులకు ఆ ఫాం సబ్మిట్ చేయాలి.


మీ బయోమెట్రిక్ వివరాల్ని కూడా నమోదు చేయించుకోవాలి.


అప్పుడు అధికారులు మీ లైవ్ ఫొటో తీసుకుంటారు.


అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్‌తో (URN) మీకు ఒక అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ ఇస్తారు. దీనితో మీ అప్లికేషన్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.


>> ఆధార్ కార్డులో ఫొటో సహా ఇతర వివరాల్ని అప్‌డేట్ చేసుకునేందుకు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది.


>> ఆధార్ కార్డ్ అప్డేట్ అయ్యాక.. మనం ఆధార్ వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ ఆధార్ అని ఉన్న దగ్గర క్లిక్ చేసి డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మొబైల్ నంబర్‌కు ఓటీపీ వెళ్తుంది. అది ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com