ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 11:49 AM

రాష్ట్రాన్ని ముక్కలుచేసి, ప్రత్యేక హోదా లేకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. వైయ‌స్ఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. వైయ‌స్ఆర్ చనిపోతే ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది  ఈ కాంగ్రెస్ పార్టీ, అలాంటి పార్టీలో షర్మిల చేరార‌ని రోజా త‌ప్పుప‌ట్టారు. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని మంత్రి రోజా విమర్శించారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైయ‌స్ పేరు షర్మిల వాడుకుంటోందని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌ ఆశయాల కోసం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి వస్తే.. వైయ‌స్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయ‌స్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com