ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ గాలులతో విజయవాడలో ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 05, 2023, 01:19 PM

 విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డు భానునగర్ వద్ద తుఫాన్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. భారీ ఈదురుగాలులతో ఐరన్ రాడ్స్ కుప్పకూలాయి. తీవ్రమైన గాలికి బిల్డింగ్ ప్లాస్టింగ్ సపోర్టింగ్ కోసమా కట్టిన పరంజ కూలిపోయింది. సుమారుగా ఐదంతస్తులపై నుంచి పరంజ జారి పడిపోయింది. ఐరన్ రాడ్లు ఒక్కసారిగా ఐదు అంతస్తులపై నుంచి పడిపోవడంతో సుమారుగా ఐదు ఇల్లులు ధ్వంసమయ్యాయి. ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఐరన్ రాడ్లు పడిన సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ నష్టం వాటిల్లడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com