ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐఫోన్ కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్...!

Technology |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 12:08 PM

కొత్త యాపిల్ ఐఫోన్ కొనాలనుకునే వారికి శుభవార్త. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ పాత తరం ఐఫోన్‌లపై కళ్లు చెదిరే ఆఫర్‌ను ప్రకటించింది. బడ్జెట్ తక్కువైనా సరే. రూ.10వేలకే యాపిల్ ఐఫోన్ 12ను సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే డివైజ్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల వివరాలు పరిశీలిద్దాం.
ఐఫోన్ 12 ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 17 శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 64GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.49,900. కానీ ప్రస్తుతం రూ.40,999గా లిస్ట్ చేయబడింది. బ్యాంక్ ఆఫర్‌లతో పరికరం ధర మరింత తగ్గింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో EMI ఎంపికలో iPhone 12 కొనుగోలుపై రూ.1,000 అదనపు తగ్గింపు గా ఉంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com