ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లిన భారత్

sports |  Suryaa Desk  | Published : Tue, Oct 03, 2023, 10:57 AM

చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ఆటతీరుతో చెలరేగుతోంది. హాంకాంగ్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో 13-0 తేడాతో గెలిచింది. తద్వారా సెమీ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. భారత్ తన లీగ్ మ్యాచ్‌లను మూడు విజయాలు, ఒక డ్రాతో అజేయంగా ముగించింది. పూల్ Aలో అగ్రస్థానంలో ఉన్న భారత జట్టు అక్టోబర్ 5న పూల్ B రన్నరప్‌తో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com