భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) నుండి వైదొలగాలని పార్టీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఎఐఎడిఎంకె) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి సోమవారం తెలిపారు. ‘‘పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో అందరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ సమావేశంలో రెండు కోట్ల మంది కార్యకర్తల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాని ఆధారంగానే బీజేపీ-ఎన్డీయే నుంచి వైదొలగాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రధాన కార్యదర్శిగా ఇది నా నిర్ణయం కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలందరి నిర్ణయమని పళనిస్వామి విలేకరుల సమావేశంలో అన్నారు.
![]() |
![]() |