ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు తీర్చమంటే అరెస్టులు చేస్తారా..?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:58 PM

సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్‌టియు ల అనుబంధ సంఘాల అంగన్వాడీలు నేడు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలను ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడంపై రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీలను అరెస్టులు చేయడం దుర్మార్గమని, ఏపీలో ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులకు పాతరేస్తోందని, రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్రతో పాలన సాగిస్తున్నారని, ప్రజాతంత్ర వాదులంతా ఈ దుష్ట విధానాలను ఖండించాలని కోరుతున్నామని రామకృష్ణ అన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com