ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్!

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 01:20 PM

వన్డే ప్రపంచకప్‌-2023కు ముందు దక్షిణాఫ్రికాకు ఎదురు దెబ్బతగిలింది. ఆ జట్టు పేసర్లు అన్రిచ్‌ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా ప్రకటించిన జట్టులో వీరిద్దరూ ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్‌ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ భర్తీ చేసింది. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్‌బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com