దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో సభ ప్రారంభమైంది.ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణసింగ్, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 'ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్‌మహోత్సవ్ వేళ నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భవనం పూరాతన నుంచి నూతనత్వానికి మాధ్యమం. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్ అద్దం పడుతుంది. పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి.