కార్వేటినగరం మండల పరిధిలో అక్రమంగా నాటు సారా తయారీ స్థావరాలపై నిర్వహించిన మెరుపు దాడుల్లో 400 లీటర్ల సారా ఊట ను ధ్వంసం చేసినట్టు ఎస్ ఈ బి సీఐ నాగరాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ. ఆదివారం ఉదయం కార్వేటినగరం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో తమకు వచ్చినా రహస్య సమాచార మేరకు మెరుపు దాడులు నిర్వహించి 400 లీటర్ల నాటు సార ఊటను, సారా తయారీకి వినియోగించే పరికరాలను ధ్వంసం చేసామన్నారు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.