చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డు జిడ్డు కాలనీలో గత కొన్ని నెలలుగా విద్యుత్ లోఓల్టేజ్ వలన ఎస్టి కాలనీ వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి పలువురు నేతలు పలుమార్లు తీసుకువెళ్లిన సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయడం లేదు, ప్రతి నెల విద్యుత్ బిల్లులు కట్టకపోతే కాలనీలో మా సామాజిక వర్గాలకు చెందిన లైన్ మెన్ లను పంపించు మరి విద్యుత్ తీగలు పీకి వేసి కాలనీవాసులను ఉక్కిరి. బిక్కిరి చేడమే కాకుండా భయభ్రాంతులను గురి చేసిన సందర్భాలు కోలాలుగా ఉన్నాయి.
ఈ సమస్య ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినికి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా చెప్పడంతో విద్యుత్ స్తంభాలు వేయడమే కాకుండా విద్యుత్ లైన్లను మరమ్మత్తులు చేస్తామని పర్యటనకు వచ్చినప్పుడు విద్యుత్ శాఖ అధికారులు ఆమెతోబాహాటంగానే చెప్పారు. ఈ సమస్య నేటికి ముందుకు వెళ్లలేదు దీంతో కాలనీ ఎస్టీ ప్రజలు విద్యుత్ సమస్యను పరిష్కారం చేయాలి కదా. అంటూ అధికారుల పైన విమర్శన వస్త్రాలు విరుస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బి. శ్రీను నాయక్ మాట్లాడుతూ ఆయా ఇండ్లలో ఫ్యాన్, ఫ్రిజ్, కులర్ లాంటివి ఈ వేసవికాలంలో సహజంగా వాడుతున్నారు. మహిళలు మిక్సీలు, గ్రైండర్లు లాంటివి వస్తువుల తోపాటు మరికొన్ని ఎలక్ట్రిక్ వస్తువులు వాడుతున్నారు.