ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబులెన్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అంబులెన్స్ బిజ్నోర్ నుండి రోగిని తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ అక్కడినుండి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.