ఏపీలో నేటి నుండి వచ్చే నెల ఆరో తేదీ వరకు పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఈనెల 30, వచ్చే నెల ఒకటో తేదీన ఈ రెండు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 30న ఉత్తరకోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.