మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,063.49 కోట్లతో భారీ బడ్జెట్ను రూపొందించారు. గత బడ్జెట్తో పోల్చితే ఇది రూ.486.13 కోట్లు అధికం. బడ్జెట్ ముసాయిదాను స్టాండింగ్ కమిటీ ఆమోదించడంతో ఈనెల 15న కౌన్సిల్ ఆమోదానికి పెట్టనున్నారు. ఈ మేరకు బడ్జెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంతోపాటు బడ్జెట్ ముసాయిదా కాపీలను ఇప్పటికే కార్పొరేటర్లకు అందజేశారు.