ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటి నుంచి నరసింహస్వామి పుట్ట తిరునాళ్ల

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:12 PM

పెద్దరావిడు మండలంలోని తోకపల్లె గ్రామంలో సద్గురు యోగానంద నరసింహస్వామి 67వ పుట్ట తిరునాళ్లను బుధ, గురువారాల్లో నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు, అర్చకులు కె. భవానీప్రసాద్ మంగళవారం తెలిపారు. 1వ తేదీన ఉదయం 9 నుంచి 11 వరకు దీక్షాస్వాముల ఇరుముడి, మధ్యాహ్నం 12 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం, ఆలయం ప్రాంగణంలో 4 గంటలకు దీక్షాస్వాములతో హోమం అనంతరం దీక్ష విరమణ, భారత కోలాటం, రాత్రి భక్తప్రహ్లాద నాటకం ఉంటుందని అన్నారు. 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు భరత నాట్యం, మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. కావున ఆయా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com