ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా సీతారాముల నిత్యకల్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 12:25 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సీతారాముల నిత్యకళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం స్వామి వారి కళ్యాణమూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చారు.


ముందుగా భద్రాద్రి దివ్యక్షేత్ర మహత్యాన్ని భక్తులకు అర్చక స్వాములు తెలిపిన అనంతరం నిత్యకళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి నిత్య కళ్యాణతంతును కన్నులపండుగగా నిర్వహించారు. అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామి వారి నూతన వస్త్రాలు, అక్షింతలు, ప్రసాదం వితరణ గావించారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com