ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశిఫలాలు: 31-01-2023 మంగళవారం

Astrology |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:56 AM

మేషం
వ్యాపారాలలో ఒడిదుడుకులు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. ఉద్యోగులకు మార్పులు.శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు.

వృషభం
ఆకస్మిక ధనలాభం. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం.

మిధునం
కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పదు. ఉద్యోగులకు చికాకులు.బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, ఆరోగ్యభంగం.

కర్కాటకం
ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పనులు సకాలంలో పూర్తి.

సింహం
వ్యాపారాలు విస్తరిస్తారు.పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి,వస్తు, వస్త్రలాభాలు, దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు.

కన్య
ఆస్తి తగాదాలు.ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు, అనారోగ్యం.

తుల
పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయట చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు, అనారోగ్యం.

వృశ్చికం
వ్యాపార విస్తరణయత్నాలు .శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు.ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం.

ధనస్సు
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఇంటాబయట ప్రోత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు.

మకరం
వ్యాపారాలు మందగిస్తాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలయ దర్శనాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది.

కుంభం
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యయప్రయాసలు, బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఉద్యోగులకు చిక్కులు,శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.

మీనం
వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. కొన్ని నిర్ణయాలుతీసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు,ఇంటర్వ్యూలు అందుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com