నోయిడాలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు లక్షకు పైగా కాలం చెల్లిన వాహనాలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అధికారులు సీజ్ చేయనున్నారు. అటు కాలం చెల్లిన వాహనాల నియంత్రణకు కేంద్రం తీసుకొచ్చిన తుక్కు పాలసీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవటంతో నోయిడా అధికారులు చర్యలు ప్రారంభించారు.