ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా శ్రీ పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:49 PM

శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని శనివారం ఆలయ కమిటీ సభ్యులు అలాగే గ్రామ పెద్దలు సమక్షంలో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని, పసుపు, కుంకుమ, చీర, సారెలతో అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జాతర నేపథ్యంలో గ్రామంలో కబడ్డీ పోటీలను కమిటీ సభ్యులు నిర్వహించారు. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన కబడ్డీ పోటీలలో విజయం సాధించిన జట్లకు నగదు ప్రోత్సాహకాలను కమిటీ సభ్యులు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com