ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులతో కిటకిటలాడుతున్న సూర్యభగవానుడు దేవాలయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 10:33 AM

మాఘ ఆదివారం పుణ్య దినాన్ని పురస్కరించుకుని శృంగవరపుకోట మండలంలో గల శ్రీ సూర్య భగవానుడి ఆలయాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాఘ మాసంలో వచ్చే మొదటి ఆదివారం కావడంతో ప్రధానంగా శృంగవరపుకోట పట్టణంలో గల సూర్య భగవానుడి దేవాలయంలో ఆలయ అర్చకులు సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో ఆదివారం వేకువజామున స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మాఘ ఆదివారాన్ని పరిష్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com