ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాల్లోకి నోట్లు విసిరిన వ్యక్తి..ఎరుక్కొనేందుకు ఎగబడిన జనం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 09:04 PM

డబ్బు మీ ఎవరికైనా వ్యామోహమే. ఎంతటి వారైనా దాని కోసం పరిగెడుతారు. ఇదిలావుంటే బెంగళూరు నగరంలోని కేఆర్ మార్కెట్ ప్రాంతం మంగళవారం ఉదయం రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. ఈ సమయంలో మార్కెట్ ఏరియా వద్ద ఉన్న ఫ్లైఓవర్ నుంచి ఓ వ్యక్తి కరెన్సీ నోట్లను గాల్లోకి ఎగరేసి అల్లకల్లోలం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి గోడ గడియారం మెడకు తగిలించుకొని ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బ్లేజర్ ధరించి స్మార్ట్‌గా ఉన్న ఆ వ్యకి.. రద్దీగా ఉన్న సమయంలో.. గాల్లోకి పది రూపాయల నోట్లను విసిరాడు.


ఆ నోట్లను చూసిన ప్రజలు.. ఎగిరి గంతేస్తూ అందుకునేందుకు ఎగబడ్డారు. కొందరు అతని దగ్గరకు వచ్చి డబ్బులను అడిగారు. కానీ అతను ఇవ్వలేదు. ఫలితంగా ఆ మార్గంలో కొద్దిసేపు ట్రాఫిక్‌‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. డబ్బులను గాల్లోకి విసిరిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు రూ.3 వేల పది రూపాయల నోట్లను అతడు గాల్లోకి విసిరినట్టు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్టు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com