ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 03:09 PM

జాతీయ రహదారిని ఆనుకుని వున్న అగనంపూడి సాయిబాబా ఆలయం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చట్టివానిపాలెం నిర్వాసిత కాలనీకి చెందిన పంచదార్ల వరలక్ష్మి (58) అనే మహిళ సాయిబాబా గుడి వద్ద మంగళవారం మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా అనకాపల్లి నుంచి కూర్మన్నపాలేనికి ద్విచక్ర వాహనంపై వస్తున్న ఓ వ్యక్తి బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వరలక్ష్మిని హుటాహుటిన అగనంపూడి ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడికి కూడా గాయలవ్వడంతో గాజువాకలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com