ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు 06-12-2022: మంగళవారం

Astrology |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:14 AM

మేషం
వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

వృషభం
వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి.

మిధునం
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రయత్నలలో అవరోధాలు తొలగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం
స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి.

సింహం
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు.

కన్య
బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తిఅవుతాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.

తుల

వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి.

వృశ్చికం
వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

ధనస్సు
ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

మకరం
వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.

కుంభం
వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి.

మీనం
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com