ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి తీవ్ర వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 08:35 AM
చట్టాలను రద్దుచేసే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిదని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ప్రశ్నించారు. పార్లమెంటులో ఆమోదం పొంది చట్టంగా మారిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే వ్యాఖ్యానించారు. నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ యాక్ట్‌-2014 (ఎన్‌జాక్‌)ను రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం 2015లో ఇచ్చిన తీర్పును ఉపరాష్ట్రపతి తప్పుబట్టారు. ఢిల్లీలో శుక్రవారం డాక్టర్‌ ఎల్‌ఎం సింఘ్వీ 8వ స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింఘ్వీ స్మారకోపన్యాసం ఇచ్చిన ఉపరాష్ట్రపతి ఎన్‌జాక్‌ రద్దు తీర్పును తీవ్రంగా విమర్శించారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com