ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలుకలు కూడా అక్కడ పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాయి

international |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 12:08 AM

ఏదైనా పరిశ్రమ వస్తే నేరుగా ఉద్యోగాలతోపాటు పరోక్షంగా కూడా ఉపాధి లబిస్తుంది. కానీ తాజాగా ఓ చోటు ఎలుకలు కూడా పరోక్షంగా ఉపాధినిస్తున్నాయి. ఇంట్లో ఎలుకలు పట్టడం అంత తేలిక కాదు. దానికి ఓపిక ఉండాలి. కొంచెం తెలివి కూడా ఉండాలి. ఎలుకలు బాగా సతాయిస్తున్నప్పుడు... ఎర వేసి పట్టుకుంటుంటారు. ఇందులో కొందరు సిద్ధహస్తులు ఉండే ఉంటారు. అయితే ఇలా ఎలుకలు పట్టే ఉద్యోగ నియామకాలను చేపట్టారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉంటాయనుకుంటున్నారా..?. ఏ మాత్రం అనుమానం వద్దు. న్యూయార్క్‌లో ఈ పోస్టుల భర్తీ చేపట్టారు.


ఈ కొత్త పోస్టును న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సృష్టించారు. ఆ ఉద్యోగికి వార్షిక జీతం రూ.కోటి 38 లక్షల 55 వేలుగా నిర్ణయించారు. ఈ మేరకు ఎరిక్ ఆడమ్స్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎలుకలంటే తనకు అసహ్యమని కూడా వెల్లడించారు. "న్యూయార్క్‌లో ఎలుకలపై పోరాడే శక్తి మీకు ఉందా..? మీరు ఎలుకలను పట్టుకోగలరా..? అయితే మీ ఉద్యోగం సిద్ధంగా ఉంది." అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. మేయర్ ఆఫీస్ కూడా ప్రకటన విడుదల చేసింది.


ఈ పోస్టుకు మంచి పేరు కూడా ఉంది. ఈ ఉద్యోగాన్ని చిట్టెలుక ఉపశమన డైరక్టర్ అని పిలుస్తారని మేయర్ ప్రకటనలో వెల్లడించారు. అంతేకాదు ఆ ఉద్యోగంలో చేరిన వారికి మంచి ప్యాకేజీ కూడా ప్రకటించారు. ఆ ఉద్యోగికి ఏడాదికి 170 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.కోటి 38 లక్షల 55 వేలు జీతం ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ ఉద్యోగంలో చేరడానికి కొన్ని అర్హతలు కూడా ఉండాలంట. నాయకత్వ లక్షణాలు, సత్తువ, ఎలుకలను పట్టుకునే సామర్థ్యం లాంటి అర్హతలు ఉండాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com