ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా సీతారాముల నిత్యకళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 12:43 PM
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం సీతారాములకు వైభవంగా నిత్యకళ్యాణం నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి స్వామి వారికి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నివేదన, నిత్యహోమాలు, నిత్య బలిహరణం నిర్వహించారు. అలాగే రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, గంధ సింధూరం, తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామి వారి నిత్యకళ్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి సంప్రదాయ బద్ధంగా నిత్యకల్యాణం నిర్వహించారు ఈ కళ్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com