ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బలపడుతున్న రష్యా, చైనా రక్షణ బంధం!

international |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 11:34 AM

రష్యా, చైనా బాంబర్‌ విమానాలు పశ్చిమ పసిఫిక్‌ మహాసముద్రంపై సంయుక్త గస్తీ విన్యాసాలు చేశాయి. తమ మధ్య బలపడుతున్న రక్షణ బంధాన్ని ప్రదర్శిస్తూ ఈ విన్యాసాలు చేపట్టాయి. రష్యాకు చెందిన టుపొలెవ్‌ 95, చైనా హెచ్‌-6కె బాంబర్‌ విమానాలు జపాన్‌ సముద్రం, తూర్పు చైనా సముద్రాలపై ఎనిమిది గంటలసేపు విహరించాయి. అయితే రష్యా విమానాలు మొట్టమొదటిసారి చైనాలో దిగడం, చైనా విమానాలు తొలిసారి రష్యాలోని వైమానిక స్థావరానికి వెళ్లడం విశేషం. తమ సంయుక్త విన్యాసాలు ఏ దేశానికీ వ్యతిరేకం కావని రష్యా రక్షణ శాఖ ప్రకటించినా ఉక్రెయిన్‌, తైవాన్‌ సమస్యలపై అమెరికాతో ఈ రెండు దేశాలకూ ఉద్రిక్తతలు పెరుగుతుండడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com