ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌కు భారీ విరాళం ప్రకటించిన బెన్ స్టోక్స్‌

sports |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 08:51 PM

ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ మానవత్వం చాటుకున్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ కోసం తొలిసారి పాకిస్థాన్‌లో పర్యటించాడు. తన మ్యాచ్ ఫీజును ఆదేశానికి అందజేస్తానని ప్రకటించాడు. పాకిస్థాన్‌లో ఈ ఏడాది వరదల కారణంగా దెబ్బతిన్న నగరాల పునరావాసం కోసం ఈ డబ్బును వినియోగిస్తానని ఆయన ఈరోజు ట్వీట్ చేశారు. ఈ మూడు మ్యాచ్‌ల ద్వారా బెన్ స్టోక్స్ దాదాపు రూ. 37 లక్షల మ్యాచ్ ఫీజు అందుతుంది. ఈ డబ్బును పాకిస్థాన్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com