ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:19 PM

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు (గ్రీన్ అంబాసిడర్)కు 10 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మల్లికార్జున, ఏఐటీయూసీ నాయకులు చెన్నరాయుడు హాజరయ్యారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం తహశీల్దార్ బ్రహ్మాయ్యకు అందజేశారు. 10 నెలలు జీతాలు ఇవ్వాలని, 6 వేలు చాలదని 10 వేలుకు పెంచాలన్నారు. యూనిఫామ్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com