ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు అనుగుణంగా ఆర్టీసీ బడి బస్సు నడపాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:16 PM

విద్యార్థుల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని సోమవారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హిందూపురం ఆర్టీసీ అధికారి షౌకత్ వలికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ చౌళూరు, సంతేబిందనూరు, గోలాపురం, అప్పులకుంట గ్రామాల నుండి దాదాపుగా 90 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఆర్టీసీలో వస్తున్నారు. పాఠశాల కళాశాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బడి బస్సు నడపాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com