ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు: 25-11-2022 శుక్రవారం

Astrology |  Suryaa Desk  | Published : Fri, Nov 25, 2022, 11:24 AM

మేషం
వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి.
వృషభం
సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
మిధునం
పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వాహనయోగం ఉన్నది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
సింహం
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.ఇంటాబయట సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.
కన్య
వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు.
తుల
కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు.
వృశ్చికం
కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.
ధనస్సు
ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన రుణ యత్నాలు చేస్తారు. కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
మకరం
ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కుంభం
సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి.
మీనం
ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన రుణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com