ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందంటూ ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఈ చర్యలకు పాల్పడుతుందని, ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో ఆ కుట్ర జరుగుతోందని తెలిపారు. కేజ్రీవాల్ పై దాడి చేయాలని మనోజ్ తివారీ ఇప్పటికే గూండాలకు బహిరంగంగా చెప్పాడని, పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారని అన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆప్ భయపడదని, బీజేపీ కుట్రలకు ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. కేజ్రీవాల్ పై మనోజ్ తివారీ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.
![]() |
![]() |