ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త ఆర్మీ ఛీఫ్‌గా మునీర్

international |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 03:19 PM

పాకిస్థాన్ కొత్త ఆర్మీ ఛీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ అసిం మునీర్ నియమితులయ్యారు. ఆరేళ్లుగా ఆ పదవిలో ఉన్న జనరల్ జావెద్ బాజ్వా నుంచి ఈ నెలాఖరున మునీర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది తొలినాళ్లలో తాను పదవి కోల్పోవడానికి ఆర్మీనే కారణమని మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన వేళ మునీర్ నియామకం కీలకంగా మారింది. ఈ నియామక ప్రక్రియ మెరిట్ సహా చట్టం, రాజ్యాంగాన్ని అనుసరించి జరిగిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com