ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కన్నుల పండుగగా సీతారాముల నిత్యకళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:57 PM

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం సీతారాముల నిత్యకళ్యాణాన్ని కన్నులపండుగగా నిర్వహించారు. పవిత్ర గోదావరి నది నుండి జలాలను మేలతాళాలు, మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ప్రధాన ఆలయానికి తీసుకొచ్చి స్వామి వారి మూలవరులకు అభిషేకం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి కళ్యాణ మూర్తులను బేడా మండపానికి భక్తుల జయజయ ధ్వానాల నడుమ తీసుకొచ్చి నిత్యకళ్యాణతంతు ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత విశ్వక్సేన, ఆరాధన, పుణ్యాహవాచన జరిపి కళ్యాణ తంతును కన్నులపండుగగా నిర్వహించారు. కార్తీకమాసం కావడంతో అనేక మంది దంపతులు ఈ కళ్యాణంలో పాల్గొని తరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com