ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానంతో గర్భవతైన భార్యను చంపేశాడు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:43 PM

అనుమానంతో గర్భవతైన భార్యను ఓ వ్యక్తి దారుణంగా చంపేసిన ఘటన కర్ణాటక దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా గంగొండనహళ్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మోహన్ కుమార్ తన భార్య రేష్మను దారుణంగా హతమార్చి శవాన్ని అడవిలో పారేశాడు. అనుమానం రాకుండా భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అదనపు కట్నం కోసం డిమాండ్ చేసేవాడని మహిళ బంధువుల ఫిర్యాదుతో విచారణ చేయగా అసలు నిజం బయటపడింది. కాగా, వీరికి పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com