ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా సీతారాముల నిత్యకళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Nov 10, 2022, 01:43 PM
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం సీతారాములకు ఘనంగా నిత్య కళ్యాణం నిర్వహించారు. ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాతసేవ జరిపారు. అనంతరం ఆరాధన, నివేదన సేవాకాలం, నిత్య హోమాలు, నిత్య బలిహరణం నిర్వహించారు. అలాగే రామాలయం గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, గంధ సింధూరం, తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. తదుపరి స్వామి వారి నిత్యకళ్యాణమూర్తులను మండపంలో వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా నిత్యకల్యాణం నిర్వహించారు. కళ్యాణంలో పాల్గొన్న దాతలకు స్వామివారి ప్రసాదాలను, శేష వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com