ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Nov 08, 2022, 11:50 AM

కార్తీక పౌర్ణమి వేడుకలు సోమవారం స్థానిక శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయం, భైరవుని పాడులోని శ్రీ శివ నాగేంద్ర, లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, కాలభైరవేశ్వర ఆలయాల్లో వైభవంగా నిర్వహించారు. ఆయా దేవాలయాల్లో లక్ష ఒత్తుల దీపార్చన, జ్వాలాతోరణం పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారికి సహస్రనామం తులసీపూజా, విశేషార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మహిళా భక్తులు ఉదయం కృష్ణానదిలో స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు జూనూతుల ప్రశాంత్ శర్మ, సైదయ్య స్వామి, బోయా ఈశ్వర్ రెడ్డి, లక్ష్మీ కుమారి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com