ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"క్యారెట్‌ ఓట్స్‌ సూప్‌" తయారీ విధానం

Recipes |  Suryaa Desk  | Published : Thu, Oct 20, 2022, 01:24 PM

కావలసిన పదార్థాలు:
ఓట్స్‌: పావుకప్పు,
క్యారెట్‌ ముక్కలు: అరకప్పు,
ఉల్లిపాయ: ఒకటి,
వెన్న: ఒక టీస్పూన్‌,
ఉప్పు: తగినంత,
మిరియాల పొడి: చిటికెడు,
కొత్తిమీర: కొద్దిగా

తయారీ విధానం:
ముందుగా క్యారెట్‌ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని రెండు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన ఉల్లిపాయ కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారాక గ్రైండ్‌ చేసుకుని వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌మీద గిన్నెపెట్టి వెన్న వేసి, వేడయ్యాక ఓట్స్‌ వేసి దోరగా వేయించాలి. ఇందులో కప్పు నీళ్లు పోసి రెండు నిమిషాలు ఉడికించాలి. ఇందులో క్యారెట్‌ రసం, తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త చిక్కబడేవరకు మరిగిస్తే చాలు..వేడి వేడి క్యారెట్‌
ఓట్స్‌ సూప్‌ రెడీ.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com