యాత్రకు అనుమతి లేని కారణంగా గాంధీజీ జయంతి రోజున అనంతపురంలో సైకిల్ యాత్ర చేపట్టిన.. డిస్మిస్డ్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్‌ను మూడో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. యాత్రకు అనుమతి లేదంటూ క్లాక్ టవర్ సమీపంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్’ అంటూ ఆదివారం ప్రకాష్ సైకిల్ యాత్ర చేపట్టారు. శాంతి భద్రతలను కాపాడే పోలీసుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని ప్రకాష్ ఈ సందర్భంగా ఆరోపించారు. గాంధీ పుట్టిన దేశంలో.. రఘురాముడు ఏలిన రాజ్యంలో స్వేచ్ఛ లేదని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంత్సరాలు గడిచినా.. ఇంకా బ్రిటిష్ చట్టాలు అమలు చేస్తూ స్వేచ్ఛను కాలరాస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 358 మంది పోలీసులను విధుల నుంచి తొలగించారని ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్, గ్రాంట్ ఎస్ఎల్ఎస్, ఏఎస్ఎల్ఎస్ అరియర్స్.. సామాజిక న్యాయం ప్లీజ్’ అంటూ అనంతపురంలోని పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు అమరవీరుల స్తూపం దగ్గర ప్రకాష్ ప్లకార్డును ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విధుల నుంచి డిస్మిస్ చేశారు. అయితే, అప్పటి నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక రకంగా నిరసన తెలుపుతున్నారు.
![]() |
![]() |