ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి 36వ నేషనల్ గేమ్స్... ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని...

sports |  Suryaa Desk  | Published : Thu, Sep 29, 2022, 01:42 PM

గుజరాత్‌లో నేడు 36వ జాతీయ క్రీడలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జాతీయ క్రీడలను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. జాతీయ క్రీడల్లో 36 క్రీడాంశాల్లో 7 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీ పడబోతున్నారు. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 12 వరకు జాతీయ క్రీడలు జరగనున్నాయి. అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌ఖోట్, భావ్‌నగర్‌లలో జాతీయ క్రీడలు నిర్వహించనున్నారు. ఢిల్లీలో సైక్లింగ్ గేమ్ జరగనున్న సంగతి తెలిసిందే. జాతీయ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం గమనార్హం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com