ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు: 26-09-2022 సోమవారం

Astrology |  Suryaa Desk  | Published : Mon, Sep 26, 2022, 12:22 PM

మేషం
అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి గృహమున చిక్కులు తొలగుతాయి.

వృషభం
కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.

మిధునం
ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృత్తి బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు.

కర్కాటకం
ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం
గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.దైవదర్శనాలు చేసుకుంటారు.

కన్య
నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

తుల
ఇంటాబయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృశ్చికం
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ధనస్సు
వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు కొంత మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుంభం
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగకోడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి.

మీనం
దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. ధన పరంగా చికాకులు తొలగుతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com