ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెడుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై టీడీపీ మహిళా నాయకురాలు వంగలపూడి అనిత స్పందించారు. డాక్టర్ అయిన వైఎస్ఆర్ పేరు హెల్త్ యూనివర్సిటీకి పెడితే, సెంట్రల్ జైలుకు జగన్ పేరు పెట్టాలన్నారు. 16 నెలలు జగన్ జైలులో ఉన్నందున, జైలుకు జగన్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు.