ఏపీలో మరో రెండు రోజుల పాటు వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 24, 25వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈదురగాలులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.