ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 23, 2022, 01:34 PM

వైసీపీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ మరోసారి పొడిగింపు అయింది. గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఆయనకు అక్టోబర్ 7 వరకు రిమాండ్ పొడిగించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ కారు డ్రైవర్ హత్య కేసులో మే 23 నుంచి అనంతబాబు జైలులో ఉన్నారు. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో అంత్యక్రియల కోసం బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com