ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 02:34 PM

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. పది రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. శ్రీ దేవీ శరన్నవరాత్రులలో అమ్మవారికి చేయు అలంకారాలు, కట్టే చీర రంగు, నైవేద్యం వివరాలు26-09-22 సోమవారం - పాఢ్యమి - స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి - బంగారు రంగు చీర - కట్టెపొంగలి, చలిమిడి, వడపప్పు, పాయసం27-09-22 మంగళవారం - విదియ - శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి - లేత గులాబీ రంగు చీర - పులిహార. 28-09-22 బుధవారం - తదియ - శ్రీ గాయత్రీ దేవి - కాషాయ లేదా నారింజ రంగు చీర - కొబ్బరి అన్నం , కొబ్బరి పాయసం. 29-09-22 గురువారం - చవితి - శ్రీ అన్నపూర్ణ దేవి - గంధపురంగు లేదా పసుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం , అల్లం గారెలు. 30-09-22 శుక్రవారం - పంచమి - శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి - కుంకుమ ఎరుపు రంగు చీర - దద్దోజనం, క్షీరాన్నం. 01-10-22 శనివారం - షష్ఠి - శ్రీ మహాలక్ష్మీ దేవి - గులాబీ రంగు చీర - చక్కెర పొంగలి, క్షీరాన్నం. 02-10-22 ఆదివారం - సప్తమి - శ్రీ సరస్వతు దేవి - తెలుపు రంగు చీర - దద్దోజనం , కేసరి , పరమాన్నం03-10-22 సోమవారం - అష్టమి - శ్రీ దుర్గా దేవి - ఎరుపు రంగు చీర - కదంబం , శాకాన్నం. 04-10-22 మంగళవారం - నవమి - శ్రీ మహిషాసురమర్ధిని దేవి - ముదురు ఎరుపు రంగు చీర - చక్కెర పొంగలి. 05-10-22 బుధవారం - దశమి - శ్రీ రాజరాజేశ్వరి దేవి - ఆకుపచ్చ రంగు చీర - లడ్డూలు, పులిహోర, బూరెలు, గారెలు, అన్నం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com