ట్రెండింగ్
Epaper    English    தமிழ்

26 నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 02:00 PM

గుంటూరు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని నల్లపాడు గ్రామంలోని అగస్తేశ్వర స్వామి ఆలయంలో 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జొన్నకోటి సాయి విశ్వనాధ్ బుధవారం తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకాలు ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయన్నారు. అలాగే సాయంత్రం 7 గంటలకు పంచ హారతుల కార్యక్రమం జరుగుతుందన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com