ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూళ్లకు దసరా సెలవుల్లో మార్పులేదు.. ఇంటర్ కాలేజీలకు మాత్రం..!

Education |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:41 PM
దసరా సెలవులపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ముందుగా ప్రకటించిన సెలవుల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ). సెలవులు తగ్గించాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెలవులు అమలవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శ్రీదేవసేన బుధవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9 వరకు సెలవులు ఉంటాయని వెల్లడించారు. అక్టోబర్‌ 10న బడులు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా. రాష్ట్రంలోని ఇంటర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9 వరకు దసరా సెలవులుగా ప్రకటించారు. ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ప్రభుత్వ కాలేజీలన్నింటికీ ఇవే సెలవులు వర్తిస్తాయిని ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com