ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దసరా ఉత్సవాలకు ముహూర్తపు రాట

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 01:48 PM

ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న మాడుగుల దసరా ఉత్సవాలకు బుధవారం ముహూర్తపురాట వేశారు. ఉదయం 11 గంటల ఐదు నిమిషాలకు ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎస్ శ్రీనివాసరావు చేతులు మీదుగా ముహూర్తం రాట వేయగా ఆలయ అర్చకులు నున్న శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 


మాడుగుల మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి వచ్చేనెల ఐదో తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, మోదమాంబ ఆలయ కమిటీ చైర్మన్ పుప్పల అప్పలరాజు, మాజీ జెడ్పిటిసిలు పి సరోజిని బి భవాని, భీమరశెట్టి పైడయ్య నాయుడు, జాగాని నానాజీ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com