ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు: 21-09-2022 బుధవారం

Astrology |  Suryaa Desk  | Published : Wed, Sep 21, 2022, 12:08 PM

మేషం
బంధువుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలలో మార్పులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు ముందుకు సాగవు. చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు.

వృషభం
నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి నూతన విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు.

మిధునం
కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగడం మంచిది కాదు. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.

సింహం
ఉద్యోగాలలో విలువైన పత్రాలు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తి వివాదాలు పెద్దల సహాయంతో రాజీ చేసుకుంటారు.

కన్య
వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వాహనయోగం ఉన్నది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల
వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగయత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు. ఇంటా బయట విచిత్ర సంఘటనలు పూర్తి చేసుకుంటాయి. నూతన వస్తులాభాలు పొందుతారు.

వృశ్చికం
దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో మీకు రావలసిన గుర్తింపు వేరే వారికి వస్తుంది చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది.

ధనస్సు
వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. దీర్ఘకాలిక రుణాలు వత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. అనుకున్న పనుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఆలోచన తప్పదు.

మకరం
ఆకస్మిక ధన, వస్తులాభాలు పొందుతారు. నూతన పరిచయాలు సంతోషాన్నిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. గృహమున బందు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

కుంభం
వృత్తి ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయం అందిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు.

మీనం
పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com