కేంద్రమంత్రి నారాయణ రాణె ఇంటి వద్ద అక్రమ కట్టడాలను కూల్చేయాలని బాంబే హైకోర్టు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ను ఆదేశించింది. మంత్రికి రూ.10 లక్షలు జరిమానా విధించింది. నారాయణ రాణె బంగ్లా నిర్మాణంలో కోస్టల్ రెగ్యులేషన్ జోన్, ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను 2 వారాల్లోగా కూల్చేయాలని ఆదేశించింది.